హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి చరిత్రను వక్రీకరించే చా తుర్యం ఉన్న నాయకుడు అనుకోలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఎద్దేవా చేశారు. రేవంత్ అంటే గౌరవం ఉండేదని, కా నీ చిహ్నం మార్చివేసి రాబోయే తరాలకి వి షం నింపుతారని అనుకోలేదని ఫైరయ్యారు. రాష్ట్ర రాజముద్ర మార్పు, కాకతీయ రాజులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రసూన ఓ వీడియోను విడుదల చేశారు.
తెలంగాణ లోగో మార్పు వివాదంలో రేవంత్రెడ్డి వైఖరిని తప్పుబడుతూ, గణపతి దేవుడు కమ్మ వంశానికి చెందినప్పటికీ యాదవ మహారాణిని వివాహ మాడి రెండు కులాల మధ్య చైతన్యాన్ని కల్పించి.. సామాజిక విప్లవానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నం లో కాకతీయ కళాతోరణం తీసివేస్తామని రేవంత్రెడ్డి చేసిన ప్రకటన వెనుక మంత్రి సీతక్క పాత్ర కూడా ఉన్న ట్టు అర్థమవుతున్నదని ఆరోపించారు. కాకతీయులు క్రూరు లు అని రేవంత్రెడ్డిచే మాట్లాడించడం సమంజసం కాదని ప్రసూన సూచించారు.