హైదరాబాద్, జూన్ 24 : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ వ్యాపార విస్తరణలో భాగంగా రూ.4,500 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నది. ఈ నిధులతో బెంగళూరుతోపాటు కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, కోయంబత్తూరు, వైజాగ్‌లలో నూతన క్యాంపస్‌లు, ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకోనున్నట్టు ప్రకటించింది.
సంస్థలో 6 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.