హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association Of North America) ఆధ్వరంలో జులైలో అమెరికాలో(America)ని పెన్సిల్వేనియా కన్వెన్షన్లో నిర్వహిస్తున్న 23వ తానా(TANA) సభలకు రావాలని రాష్ట్ర మంత్రులకు తానా సంఘం ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ మేరకు హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar), రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli Dayakar)ను కలిసి మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు. సభలకు ఆహ్వానించినందుకు గాను మంత్రులు తానా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.