హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సీసీఐని వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్పాండేకు గురువారం లేఖ రాశారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకు ఉపయోగించుకోవడంతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు సిమెంట్‌ను రవాణా చేయొచ్చని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ హామీని కూడా లేఖలో తమ్మినేని ప్రస్తావించారు.