హైదరాబాద్ : కాంగ్రెస్(Congress) పార్టీతో దోస్తీకి సీపీఎం(CPM) పార్టీ గుడ్ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) ఆరోపించారు. స్నేహ ధర్మాన్ని విస్మరించి వామపక్షాలను అవమానించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని, రెండు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
అనివార్య పరి స్థితుల్లోనే సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలువకూడదనేది మా పార్టీ విధానం అన్నారు. సీపీఎం పోటీ చేయని స్థానంలో బీజేపీకి కాకుండా ఇతర అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు.
సీపీఎం పోటీ చేసే స్థానాలు..