బాసర, మే 7 : వాట్సాప్ గ్రూపు ల్లో తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాసర ఆలయ అర్చక సిబ్బంది బుధవారం ఏఎస్సై గంగారాంకు ఫిర్యాదు చేశారు. భక్తులను దోచుకుని, విలాసవంతమైన గృహం నిర్మించుకుని జీవిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుచేసిన వారిలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్మహారాజ్, అచ్యుత్ మహారాజ్, ప్రదీప్ మహారాజ్, బాలకృష్ణ, సుధీర్ మహారాజ్, హరీశ్ పంతులు ఉన్నారు.