హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 17 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రెపల్లి సతీశ్ బుధవారం ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కు ఫిర్యాదు చేశారు. పూరీ జగన్నాథ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వాడి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని పేర్కొన్నారు. పాటలో కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని లేదంటే పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కనీస విలువలతో సినిమాలు తీయాలని డైరెక్టర్‌కు సూచించారు. పూరీపై కేసు నమోదు చేయాలని డీసీపీకి విజ్ఞప్తి చేశారు.