హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వాస్తవాలు తెలుసుకోకుండా మహిళా కండక్టర్‌ను దూషించిన మణుగూరు డిపో మేనేజర్‌పై యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. విధి నిర్వహణలో ప్రయాణికులకు, సిబ్బందికి జరిగిన గొడవలో వాస్తవాలు తెలుసుకోకుండా కండక్టర్ తేజశ్వినిని ఇష్టం వచ్చినట్టు దూషించడం అమానుషమని ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రిక్వెస్ట్ స్టేజ్‌లో ఆపొద్దని సంస్థ ఎండీ ఆదేశాలు ఉన్నా.. మణుగూరు డిపో మేనేజర్ వాస్తవాలు తెలుసుకోకుండానే కండక్టర్‌ను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.