హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలోని బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (బీఐసీఎస్) డైరెక్టర్ సనగ శ్రీనివాసుల అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. శనివారం స్పీడ్‌పోస్టు ద్వారా ఫిర్యాదు పత్రాన్ని పంపించారు. యూనివర్సిటీకి చెందిన టెండర్లలో అవినీతికి పాల్పడటంతోపాటు, కాంట్రాక్టర్లతో కుమ్మైక్కె, యూనివర్సిటీని భ్రష్టు పట్టించినట్టు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలో ఇటీవల మెస్ టెండర్ల విధానంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు.