హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నకిలీ దంతవైద్యశాలలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ కోరింది. ఈ మేరకు సోమవారం డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేసింది. అర్హతలేని వైద్యుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్ గులాబీవర్ణంతో మెరిసిపోయింది. రొమ్ము కాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా రాజ్‌భవన్‌లో గులాబీరంగు దీపాలను వెలిగించారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ పీ రఘురాం పాల్గొన్నారు.