హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ఆ బాధ్యతలను ఒమర్ జలీల్ ఐఏఎస్ (రిటైర్డ్) నిర్వర్తించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తఫ్సీర్ ఇక్బాల్ ఐఎస్‌డబ్ల్యూ డీఐజీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.