హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): మెడికోలకు ైస్టెపెండ్ ఇవ్వకపోవడంపై అందిన ఫిర్యాదు మేరకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) శనివారం నోటీసులు జారీ చేసింది. ైస్టెపెండ్ ఇవ్వకపోవడంతోపాటు విద్యార్థులను వేధిస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఈ చర్యలు ఎన్ఎంసీ, యూజీసీ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని పేర్కొంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసిన ైస్టెపెండ్ వివరాలను ఆధారాలతో జూన్ 10లోగా అందించాలని ఆదేశించింది.
‘అగ్రి’ అనుబంధ వర్సిటీల్లో దరఖాస్తుల ఆహ్వానం
వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్) మే 31: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల, పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయం, బీఎస్సీ ఉద్యాన, బీటెక్ వ్యవసాయ ఇంజినీరింగ్, బీటెక్ ఆహార సాంకేతికత, బీఎస్సీ హోంసైన్స్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వివరాలకు www. Pjtau.edu.inను సంప్రదించాలని సూచించారు.
హర్టికల్చర్ పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్
హైదరాబాద్ మే 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ హర్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో 2025-26 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.skltghu.ac.in <http://www.skltghu. ac.in>ను లేదా 9603268682, 9121557037, 9398166973, 7075120145 నంబర్లలో సంప్రదించాలని కోరారు.