హైదరాబాద్: టీ-హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమమైనది అయిన నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని టీ-హబ్ సొంతం చేసుకున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
టీ-హబ్ నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని సొంతం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న టీ-హబ్ టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. టీ-హబ్ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందినదని మంత్రి తెలిపారు.
Happy & Proud that @THubHyd has won the National Technology Award -2023 (Technology Business Incubation) 😊
Many congratulations to Team T-Hub 👏
T- Hub has been recognised as the Best Technology Incubator in India by Department Of Science & Technology, Govt of India 🇮🇳 pic.twitter.com/0gbxYeNYpb
— KTR (@KTRBRS) May 14, 2023