రాజులు.. రారాజుల తలరాతలు
రాబందు రాకతో తారుమారు
ప్రజలు ప్రసాదించిన సార్వభౌమత్వాలు
పెద్ద పాము బుసగొడితే
పేలిపోయే నీటి బుడగలు
నియో సామ్రాజ్యవాద పంజరంలో
రెక్కలు తెగిన పావురాలు చిన్న దేశాలు
బలిసినోడి బరితెగింపు దాడిలో
దేశాధినేతలకు బిగుసుకొనే ఉరితాళ్లు
నాడు సద్దాం, గడాఫీలు
నేడు నికోలస్ మదురో
రేపు గుస్తావో పెట్రోనో.. ఇంకెవరో..
మాదకద్రవ్యాలు.. అణుబాంబులు
ఆక్రమించేందుకు వాడు
సంధించే ఆరోపణాస్ర్తాలు
చమురు- ఖనిజ సంపదలే
కబళించే కుట్రలకు కారణాలు
పేరుకుపోయిన ఆయుధ రాశులు
పెరిగిపోయిన డాలర్ గుట్టలు
తలకెక్కిన అహంకారపు సెగలు
రాజ్యాలనే కొంటాననే
అగ్రరాజ్యపు ‘ఉగ్ర’వాదాలు
లిబర్టీ స్టాట్యూ పాదాల వద్ద తెగిన గొలుసులు
బానిసత్వం అంతానికి సూచికలు
ప్రపంచ పెద్దన్న కావాలన్న
ప్రెసిడెంట్ల మెదళ్లలోనేమో
బడుగు దేశాలను బంధించే పాచికలు
అమ్ములపొదిలో అణ్వాయుధాలు
అంతరంగంలో మ్రోగే యుద్ధారావాలు
అయినా శాంతి బహుమతికై అంగలారుస్తావు
వంద గొడ్లను తిన్న రాబందు
ఒక్క గాలివానకు కొట్టుకుపోతుంది
పామును చంపిన చీమల చరిత్ర
ఎప్పటికీ వర్తమానమేగాజోజు
-నాగభూషణం
9885462052