టీహబ్ @11 ఏండ్లు
తెలంగాణలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన టీహబ్ పురుడుపోసుకొని నవంబర్ 5 నాటికి పదకొండేండ్లు పూర్తి చేసుకొని పన్నెండో ఏట అడుగుపెడుతున్నది. దశాబ్దానికి పైగా తన ప్రస్థానంలో టీహబ్ అద్భుత విజయాలతో ముందుకు సాగుతున్నది. టీహబ్ మద్దతుతో ‘స్కైరూట్ ఏరోస్పేస్' భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్లను రూపొందించి నింగిలోకి పంపిన ఘనత దక్కించుకున్నది.
- స్టార్టప్‌ల హబ్‌గా నిలిచిన హైదరాబాద్.. ఐటీ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో బీజం
- అంకురాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు
- విజయవంతంగా కొనసాగుతున్న ప్రస్థానం
- కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ విజన్ ఫలితం
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన టీహబ్ పురుడుపోసుకొని నవంబర్ 5 నాటికి పదకొండేండ్లు పూర్తి చేసుకొని పన్నెండో ఏట అడుగుపెడుతున్నది. దశాబ్దానికి పైగా తన ప్రస్థానంలో టీహబ్ అద్భుత విజయాలతో ముందుకు సాగుతున్నది. టీహబ్ మద్దతుతో ‘స్కైరూట్ ఏరోస్పేస్’ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్లను రూపొందించి నింగిలోకి పంపిన ఘనత దక్కించుకున్నది. దీంతో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు టీహబ్ వేదికగా నిలుస్తున్నది. అంకురసంస్థలకు చేయూతనివ్వాలనే ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరణల వేదిక సంకల్పం తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నది.
పోటీ ప్రపంచంలో సత్తా చాటేలా
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమేటివ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ అండ్ ఫార్మా, టెక్నాలజీ అండ్ ఐటీ సర్వీసెస్, ఎనర్జీ అండ్ యుటిలిటీస్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ రిటైల్, కన్సల్టింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ రంగాల్లో అత్యాధునిక స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు టీహబ్ సహకారం అందిస్తున్నది. దీంతో పాటు ఆయా సంస్థల వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేసుకొనేందుకు చేయూతను అందిస్తూ పోటీ ప్రపంచంలో తమ సత్తాను చాటేందుకు ఔత్సాహిక ఆంత్రపెన్యూర్లకు దోహదపడుతున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తూ ఆలోచనలతో వచ్చే ఆంత్రపెన్యూర్లకు తమ వ్యాపార విస్తరణకు మద్దతునిస్తున్నది. స్టార్టప్‌లు, కార్పొరేట్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, ప్రపంచ మార్కెట్‌ను ఒకే చోట చేర్చడంలో టీహబ్ కీలకంగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 5,72,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్‌ను ఏర్పాటు చేయగా. ఆంథ్రప్రెన్యూర్ల ఆలోచనలు కార్యరూపం పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నది.
ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు ఊతం
బీఆర్ఎస్ హయాంలో ఐటీ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు ఊతం లభించింది. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ మెరుగుపడాలంటే నైపుణ్యం గల మానవ వనరులు అవసరమని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఆయా కంపెనీలకు అవసరమైన స్కిల్స్‌ను టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి వారిని ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దారు. టీహబ్‌తో సత్ఫలితాలు రావడంతో వీహబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీవర్క్స్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)ను ఏర్పాటు చేశారు.
కొత్త ఆవిష్కరణలతో వచ్చిన స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీహబ్ దేశానికి గర్వకారణమని ఎన్నారైలు సైతం ప్రశంసించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఆంత్రప్రెన్యూర్లను ప్రోత్సహించడంలో తెలంగాణ ఆరు రాష్ర్టాలతో కలిపి టాప్‌లో నిలిచినట్టు 2024లో కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్ స్పష్టం చేయడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన ప్రపంచ స్థాయి మౌలికవసతులు, టెక్ ఎకోసిస్టమ్, ప్రభుత్వ పాలసీలతోనే ఇది సాధ్యమైంది. ఐటీ రంగాన్ని టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరించాలని కేసీఆర్ హయాంలో టీహబ్లను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆ లక్ష్యం నెరవేరడం లేదు.
టీ హబ్ ఇంపాక్ట్ ఇలా
- 3,300కు పైగా స్టార్టప్‌లకు ప్రయోజనాలు
- ఇక్కడి స్టార్టప్‌లకు 2 బిలయన్ డాలర్లకు పైగా నిధులు
- టీహబ్ కేంద్రంగా 308కి పైగా మెంటర్లు
- 200కు పైగా కంపెనీల నుంచి స్టార్టప్‌లకు ప్రోత్సాహం
- 90కి పైగా ఇన్నోవేషన్, 80కి పైగా వాల్యూ పార్ట్నర్లు
టీహబ్ అందుకున్న అవార్డులు
- బెస్ట్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023)
- ఇండియా బెస్ట్ ఇంక్యుబేటర్ (నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022)
- ఆంత్రప్రెన్యూర్‌షిప్ ఎనబ్లర్ అవార్డు (ఎస్‌ఐబీఏ-2023)
- టాప్ పర్ఫార్మర్-గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ (స్టేట్ సార్టప్ ర్యాంకింగ్-2022)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hyderabad Startups
- KCR
- KTR
- T-hub
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

