కాంగ్రెస్ తెచ్చిన నీటి కష్టాలు
నగరానికి ‘జల సంక్షోభం’ ముంచుకొస్తున్నది. రోజురోజుకు నీటి సమస్య తీవ్రతరమవుతున్నది.
- నీళ్లు ఇవ్వలేమంటూ.. కమ్యూనిటీ సొసైటీల నోటీసులు
- ప్రైవేట్ ట్యాంకర్లు రాకపోవడంతో తీవ్రమైన నీటి సమస్య
- జలమండలి నీళ్లు ఏమూలకూ సరిపోకపోవడంతో అవస్థలు
- వెస్ట్ సిటీలోని అపార్ట్మెంట్లలో సమస్య మరింత జటిలం
నగరానికి ‘జల సంక్షోభం’ ముంచుకొస్తున్నది. రోజురోజుకు నీటి సమస్య తీవ్రతరమవుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో సిటీలో నీటికి కటకట తప్పడం లేదు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బోర్లు వట్టిపోతున్నాయి. జలమండలి నీళ్లు ఏ మూలకు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం.. ప్రైవేట్ బోర్లను సీజ్ చేయడం.. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరాను అనుమతించకపోవడం వంటి చర్యలతో నగరవాసులు నీటి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా ప్రైవేట్ ట్యాంకర్ల నిలిపివేత.. వెస్ట్ సిటీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో బోరు నీళ్లు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లే దిక్కుగా మారాయి. ట్యాంకర్ల యాజమాన్యాలపై సర్కార్ ఆంక్షలు విధించడంతో గేటెడ్ కమ్యూనిటీల సొసైటీలు నీట సరఫరా షట్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. రోజులో కొద్ది గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని ఆయా సొసైటీల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశముంటుందని, సన్నద్ధం కావాలంటూ.. ప్రత్యేకంగా సర్క్యులర్లు జారీ చేస్తూ.. గేటెడ్ కమ్యూనిటీల నోటీసు బోర్డుల్లో ఉంచుతున్నారు. నివాసితులంతా నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): నగరంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో పరిస్థితి మరింత జటిలమవుతున్నది. కొద్దిరోజులుగా ప్రైవేట్ బోర్లను సీజ్ చేయడం, ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరాను అనుమతించకపోవడంతో నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతున్నది. ముఖ్యంగా ప్రైవేట్ ట్యాంకర్ల నిలిపివేత ప్రభావం వెస్ట్ సిటీపై మరింతగా పడింది.
ఈ ప్రాంతాల్లోనే ఉన్న వందలాది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరాను నిలిపివేయడం చిచ్చు రేపుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నుంచి వచ్చే నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. జలమండలి నీటి సరఫరా గేటెడ్ కమ్యూనిటీల్లో కనీసం సగానికి కూడా సరిపోవడం లేదు. ఆయా కమ్యూనిటీలకు నిత్యం వందలాదిగా ప్రైవేట్ ట్యాంకర్లే నీటిని సరఫరా చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరా నిలిచిపోవడంతో నీటి ఎద్దడి తీవ్రమైంది. గేటెడ్ కమ్యూనిటీల్లో దీని ప్రభావం నీటి సరఫరా షట్‌డౌన్ అయ్యే స్థితికి చేరుకున్నది.
నోటీసు బోర్డుల్లో హెచ్చరికలు
ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరా నిలిచిపోవడం గేటెడ్ కమ్యూనిటీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రోజులో కొద్ది గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని ఆయా సొసైటీల వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపిస్తున్నారు. జలమండలి నీళ్లు సరిపోకపోవడం, ప్రైవేట్ ట్యాంకర్ల బంద్ నేపథ్యంలో నీటి సరఫరా చేయలేమని నివాసితులకు సర్క్యులర్లు జారీ చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరింత నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని.. ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని హెచ్చరిస్తున్నారు. కాగా, వెస్ట్ సిటీ పరిధిలోని 9 నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న సింగూరు, మంజీరా నుంచి నీటి విడుదల పూర్తిగా బంద్ కానున్నది. ఇప్పటికే జలమండలి సరఫరాను వారానికి రెండు రోజులు మాత్రమే చేశారు. వీటన్నింటి కంటే గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఆధారపడే ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆయా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పరిస్థితి తీవ్రతరమైంది.
వెస్ట్ సిటీపై తీవ్ర ప్రభావం
ప్రభుత్వం ప్రైవేట్ బోర్లు, ట్యాంకర్లను నిషేధించడం వెస్ట్ సిటీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గేటెడ్ కమ్యూనిటీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ హాస్టళ్లు వెస్ట్ సిటీలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాధారణంగానే నీటి సమస్య ఉంటుంది. జలమండలి సరఫరా చేసే నీరు ఇక్కడి నివాసితులు, ఆయా సంస్థలకు ఏమాత్రం సరిపోవు. దీంతో ఏండ్ల తరబడిగా వందలాది ప్రైవేట్ ట్యాంకర్లు ఇక్కడి నీటి అవసరాలను తీరుస్తున్నాయి.
ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం అకస్మాతుగా ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరాను అడ్డుకోవడంతో వెస్ట్ సిటీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మరోవైపు తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో ఐటీ కారిడార్ ప్రాంతంలోని పలు హాస్టళ్లలో ఉండే వారిని నిర్వాహకులు సొంతూళ్లకు వెళ్లిపోమంటున్నారు. నీటి సరఫరా లేకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారుతున్నదని నిర్వాహకులు వాపోతున్నారు.

వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లో చోరీ
- గేటెడ్..నో వాటర్
- ట్యాంకర్ల స్మార్ట్ కార్డులను ఎత్తుకెళ్లిన దుండగులు
- పీర్జాదిగూడలో నిలిచిన ట్యాంకర్ల నీటి సరఫరా
- గతంలో రాత్రింబవళ్లు అనధికారిక సరఫరా
పీర్జాదిగూడ ఫిల్లింగ్ స్టేషన్లో మంగళవారం దొంగతనం జరగడం కలకలం స్పష్టించింది. దీనిపై జలమండలి విజిలెన్స్ అధికారులు మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తున్నది. అయితే దొంగలు కేవలం ట్యాంకర్ల స్మార్ట్ కార్డులను మాత్రం తీసుకెళ్లడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 10 స్మార్ట్ కార్డులుండగా, 9 చోరీకి గురై ఒకదాన్ని అక్కడే వదిలి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పీర్జాదిగూడ ఫిల్లింగ్ స్టేషన్ పరిధిలో 10 ట్యాంకర్లు ఉన్నాయి. వాటితోనే ఆ ప్రాంతానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అందులో 9 ట్యాంకర్ల స్మార్ట్ కార్డులు చోరీకి గురవడంతో మూడు రోజులుగా ఒకే ట్యాంకర్‌తో నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో వందలాదిగా బుకింగ్స్ పెండింగ్‌లు ఉంటున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

