గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు మహిళలకు కాంగ్రెస్ ధోకా!
Gruha Lakshmi Scheme, Karnataka Congress, Women Beneficiaries, Pending Payments
- గృహలక్ష్మి పథకంపై కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మడతపేచీ
- నిధులుంటేనే చెల్లింపులు చేస్తాం
- హక్కుగా ప్రజలు కోరడానికి వీల్లేదు
- హైకోర్టుకు డీకే సర్కార్ సమాధానం
న్యూఢిల్లీ: గ్యారెంటీలంటూ అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలు విషయంలో చేతులెత్తేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ప్రధాన పథకమైన ‘గృహ లక్ష్మి’ కింద రెండు నెలల చెల్లింపులను నిలిపివేయాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. దీనివల్ల సుమారు కోటి మంది మహిళలకు అందచేయాల్సిన సుమారు రూ.4,000 కోట్ల మొత్తం బకాయిగా మిగిలిపోయింది. ఈ పథకం కింద అర్హులైన మహిళా గృహ యజమానులకు నెలకు రూ.2,000 అందచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2025 ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం ఒక్కో లబ్ధిదారునికి రూ.4,000 అవుతుంది. రెండు నెలలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు సమర్పించినప్పటికీ, బడ్జెట్ పరిమితుల కారణంగా గ్రాంట్లను నిలిపివేయాల్సి వచ్చిందని ఒక రిట్ పిటిషన్‌కు సమాధానంగా ప్రభుత్వం పేర్కొంది.
డబ్బుంటేనే చెల్లింపులు
ఈ పథకం కింద అందే సహాయం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉంటుందని, దీనిని అమలు చేయదగిన హక్కుగా ఎవరూ కోరలేరని ప్రభుత్వం వాదించింది. 2023 ఆగస్టు 30న ప్రారంభించిన ఈ పథకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. గృహలక్ష్మి పథకం కింద 2025 ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రెండు విడతల సాయం అందలేదని పేర్కొంటూ ఇద్దరు సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. ఈ బకాయిలు సుమారు రూ.4000 కోట్ల మేర ఉన్నాయని, దాదాపు 1.26 కోట్ల మంది మహిళలు ప్రభావితమయ్యారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అనుశివరామన్, జస్టిస్ కేఎన్ భరత్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినంత మాత్రాన, దాన్ని నిరంతరం చెల్లించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఏర్పడదని ప్రభుత్వం తన వాదనలో పేర్కొన్నది.
కాంగ్రెస్ సర్కార్‌పై మహిళల మండిపాటు
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్‌పై మహిళలు మండిపడుతున్నారు. అమలు చేయడం చేతకానప్పుడు హామీలెందుకు ఇచ్చారని నిలదీస్తున్నారు. నిధులుంటేనే చెల్లింపులు చేస్తాం.. ప్రజలు హక్కుగా కోరలేరని డీకే సర్కార్ పేర్కొనడాన్ని వారు తప్పుబడుతున్నారు. అమలు చేయడం చేతకాక, కాంగ్రెస్ సర్కార్ కుంటిసాకులు చెబుతున్నదని విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

