ట్రంప్‌పై తిరుగుబావుటా!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఫలితాలు అధ్యక్షుడి నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన తిరస్కారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సీనియర్ రిపబ్లికన్ నేత ఈ ఓటమిని అత్యంత తీవ్రస్థాయి విపత్తుగా అభివర్ణించారు. పార్టీ ఓటమికి ట్రంప్ విధానాలు, ఆయన వ్యవహారశైలే కారణమని ఆరోపించారు.
- మధ్యంతర ఎన్నికల్లో ఓటమితో సొంత పార్టీ నుంచే విమర్శలు
- ఓటమికి అధ్యక్షుడి విధానాలే కారణమని ఆరోపణలు
- మాగా శిబిరంలోనూ వ్యతిరేకత
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఫలితాలు అధ్యక్షుడి నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన తిరస్కారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సీనియర్ రిపబ్లికన్ నేత ఈ ఓటమిని అత్యంత తీవ్రస్థాయి విపత్తుగా అభివర్ణించారు. పార్టీ ఓటమికి ట్రంప్ విధానాలు, ఆయన వ్యవహారశైలే కారణమని ఆరోపించారు.
డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభతోపాటు సెనెట్‌లోనూ ఆధిక్యం సాధించింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ కరోలినా వంటి సంప్రదాయ రిపబ్లికన్ రాష్ర్టాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు నమోదు చేశారు. దీంతో పార్టీ నేతల్లో తొలుత కనిపించిన దిగ్భ్రాంతి క్రమంగా ట్రంప్‌పై అసంతృప్తిగా మారింది. టెక్సాస్‌కు చెందిన ప్రముఖ రిపబ్లికన్ లాబీయిస్టు బిల్ మిల్లర్ మాట్లాడుతూ.. ఈ ఓటమికి ట్రంప్ తప్ప మరెవరూ బాధ్యులు కాదని వ్యాఖ్యానించారు. ఇది అధ్యక్షుడిని ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లేనని, ఫలితాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధం, సుంకాలపై ఆగ్రహం
ట్రంప్ విధానాలు ఓటర్లను పార్టీకి దూరం చేశాయని రిపబ్లికన్ వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌తో యుద్ధం, దిగుమతి సుంకాలు, వలసలపై కఠిన చర్యలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని అంటున్నారు. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, జీవనవ్యయం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపాయని పేర్కొంటున్నారు. మిన్నెసోటా రిపబ్లికన్ వ్యూహకర్త గ్రెగ్ పెప్పిన్ మాట్లాడుతూ.. పార్టీ ప్రచారంలో వరుస తప్పిదాలు జరిగాయని, పలు రాష్ర్టాల్లో ఓటర్లు అధ్యక్షుడి విధానాలను తిరస్కరించారని అన్నారు. మరోవైపు, వైట్‌హౌస్‌కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి కూడా ఇరాన్ యుద్ధం, సుంకాలు, వలసలపై ప్రభుత్వ వైఖరి కలిసి పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించాయని పేర్కొన్నారు.
మాగాలో అంతర్యుద్ధం
మధ్యంతర ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ట్రంప్‌కు సొంత రాజకీయ శిబిరం నుంచే వ్యతిరేకత ఎదురవుతున్నది. ట్రంప్‌కు బలమైన మద్దతుదారులుగా ఉన్న మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పుడు ఆయన విధానాలనే తప్పుబడుతున్నారు. ఇరాన్‌తో యుద్ధం, స్వేచ్ఛావాద ఓటర్లను దూరం చేసుకోవడం, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడం పార్టీ ఓటమికి కారణమని విమర్శిస్తున్నారు. ప్రముఖ రైట్‌వింగ్ వ్యాఖ్యాత అలెక్స్ జోన్స్ ట్రంప్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన డెమోక్రాట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ట్రంప్‌తో వందశాతం యుద్ధం చేస్తున్నా అని ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

