సీఎం.. సమయపాలనేదీ?
పరిపాలనలో ప్రతి నిమిషం విలువైనదే. రాష్ర్టానికి పాలనాధికారిగా ఉన్న ముఖ్యమంత్రి ఈ నియమం విధిగా పాటించాలి. బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించే కీలక సమావేశాల విషయంలోనైనా నిర్ణీత సమయానికి హాజరై తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
- క్యాబినెట్ మీటింగ్‌కు గంట లేట్
- రేవంత్‌రెడ్డి కోసం పడిగాపులు పడ్డ మంత్రులు, అధికారులు
- మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం షురూ అవుతుందని ప్రకటన
- సచివాలయానికి 4 గంటల తర్వాత తీరిగ్గా వచ్చిన రేవంత్‌రెడ్డి
- వచ్చిన గంట తర్వాత మొదలైన గ్లోబల్ సమ్మిట్‌పై చర్చలు
- నిర్ణీత సమయం కంటే 4గంటలు ఆలస్యంగా క్యాబినెట్ భేటీ
- సీఎం సమయానికి రాకపోవడంతో ఆలస్యంగా మీటింగ్‌లు
- ఎప్పుడూ సమయపాలనపాటించడం లేదంటూ సర్వత్రా విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పరిపాలనలో ప్రతి నిమిషం విలువైనదే. రాష్ర్టానికి పాలనాధికారిగా ఉన్న ముఖ్యమంత్రి ఈ నియమం విధిగా పాటించాలి. బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించే కీలక సమావేశాల విషయంలోనైనా నిర్ణీత సమయానికి హాజరై తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టైమింగ్ అందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు సమావేశాలకు అలస్యంగా వచ్చిన సీఎం.. మరోసారి తన అలవాటును యథాతథంగా అమలుచేశారు. గురువారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చారు. మంత్రులు, అధికారులంతా పడిగాపులు కాస్తూ.. సీఎం ఇంకెప్పుడు వస్తారంటూ ఎదురుచూడాల్సి వచ్చింది.
3గంటలకు సమావేశం.. 4గంటలకు సీఎం రాక
గ్లోబల్ సమ్మిట్‌పై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్, 4గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుందని బుధవారం సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులిచ్చారు. కానీ రేవంత్‌రెడ్డి తీరిగ్గా 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. దీంతో 5గంటలకు గ్లోబల్ సమ్మిట్ చర్చల కోసం మీటింగ్ ప్రారంభమైంది.
క్యాబినెట్ భేటీ.. నాలుగు గంటలు లేట్ !
సాయంత్రం 4గంటలకు జరుగాల్సిన క్యాబినెట్ భేటీ రాత్రి 7.45 గంటలకు గానీ మొదలుకాలేదు. ముందుగా నిర్ణయించిన సమయం కంటే దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ సమావేశం ఇలా ఆలస్యంగా ప్రారంభం కావడం చర్చకు దారి తీసింది. అయితే రేవంత్‌కు లేట్‌గా రావడం కొత్తేమీ కాదు. ఆయన క్యాబినెట్ సమావేశానికి ఎప్పుడూ సమయానికి వచ్చింది లేదు. అందుకే ఏనాడూ నిర్ణయించిన సమయానికి క్యాబినెట్ మీటింగ్ కాలేదని రేవంత్‌రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఇదేనా ప్రభుత్వం పాలనపై వ్యవహరించే తీరు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాబినెట్ మీటింగ్‌కే టైమింగ్ పాటించకుంటే ఇక పాలనను ఏం సీరియస్‌గా తీసుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

