హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూను స్వీడెన్లోని బెక్లింగే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ హెన్రిక్ జాన్సన్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యూనివర్సిటీ విద్యార్థులతో వారు ముచ్చటించారు. అనంతరం ఫ్యాకల్టీ అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు. ఈ మేరకు ఇరు యూనివర్సిటీల ఉన్నాధికారులు ఎంవోయూ చేసుకున్నారు. ఆ తర్వాత స్వీడెన్ బృందం రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు.
పీఆర్లో తాత్కాలిక డిప్యూటేషన్లు
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : జీవో 317తో నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలిక పద్ధతిలో డిప్యూటేషన్లు, బదిలీలకు అవకాశం కల్పిస్తూ పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్ సృజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్లు, బదిలీలు కోరుకొనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీ సెక్రటరీలు డీపీవోల ద్వారా ఈ నెల 20లోగా తమ వివరాలు పంపాలని సూచించారు. అయితే, 190 జీవో ప్రకారం డిప్యూటేషన్లు కల్పించాలని పీఆర్ డైరెక్టర్‌ను కోరగా, అన్ని జిల్లాలకు మెమోతో పాటు ప్రొఫార్మా జారీచేశారని తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.