బండ్లగూడ, అక్టోబర్ 23: బీజేపీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే టీఆర్ఎస్లో చేరానని, ప్యాకేజీల కోసం తాను చేరినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని శాసనమండలి మాజీచైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. సొంతగూటికి స్వామిగౌడ్ రాక సందర్భంగా ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్కు విధేయుడిగా ఉంటానని, అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు.