హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సమాచారాన్ని వాట్సాప్‌లో ఉంచడానికి అధికారులు ‘స్వామి చాట్‌బాట్’ను తీసుకొచ్చారు. వాట్సాప్‌లో 6238008000 అనే నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపిస్తే సమాచారం అందజేస్తారు. ఆలయ విశేషాలు, వసతులు, ప్రసాదం,శబరిమల చుట్టుపక్కల ఆలయాల సమాచారం, విమాన, రైల్వే, బస్సు సర్వీసుల వివరాలు పంపుతారు.
సీఐఎస్ఎఫ్లో తొలి మహిళా బెటాలియన్
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్)లో అందరూ మహిళలే ఉండేలా ఓ బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఇటీవల ఆమో దం తెలిపింది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లో మహిళా సిబ్బంది 7 శాతం ఉన్నారు. ఈ నిర్ణయంతో సీఐఎస్ఎఫ్లో మహిళలకు కొత్త గుర్తింపును ఇవ్వనుంది. సీఐఎస్ఎఫ్ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.