హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీజెన్కో) హెచ్ఆర్, ఐఆర్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్వీ కుమార్‌రాజును విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధలో నూతన డైరెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సంతోషం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో వీఏవోఏటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య, ఉపాధ్యక్షుడు నాజర్షరీఫ్, స్వామి, అనురాధ శ్రీనివాస్, రామకృష్ణ, అపర్ణ, వేణు, రమణ తదితరులు పాల్గొన్నారు.