దుబ్బాక, నవంబర్ 8: సిద్దిపేట జిల్లా దుబ్బా కలోని చెల్లాపూర్‌లో ఓ యువకుడి ఆత్మహత్య పలు అనుమానాలకు దారితీసింది. మృతదేహం వద్ద లభ్యమైన రెండు లేఖలు పొంతన లేకుండా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘ టనను కొందరు రాజకీయంగా వాడుకోవడం దుమారం రేపింది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్ర కారం.. చెల్లాపూర్‌కు చెందిన రాకేశ్(22) ఎంఎల్టీ పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి భిక్షపతి చిన్నప్పటినుంచి అతడిని అసహ్యించుకునేవాడు. రాకేశ్‌కు ముఖంపై మచ్చలుండటంతో ఇటీవల ఓ దవాఖానకు వెళ్లివచ్చాడు. లేజర్ ట్రీట్మెంట్ కోసం రూ.15 వేలు కావాలని తండ్రిని అడిగాడు. ఆయన మందలించడంతో మనస్తాపానికి గురైన రాకేశ్ ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా రెండు లేఖలు లభ్యం కావడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఒక లేఖలో తండ్రి మందలించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనగా, మరో లేఖలో ఉద్యోగం రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.