కాజీపేట, జూన్ 7: అనుమానాస్పదస్థితిలో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం ప్రశాంత్‌నగర్‌లో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే& సిద్ధిపేటకు చెందిన రంగాచారి (45) నిట్ కళాశాలలో మెటలర్జీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రంగాచారి భార్య తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. గురువారం స్విగ్గీలో భోజనం తెప్పించుకొని తిని పడుకున్నాడు. శుక్రవారంఅక్క ఫోన్ చేస్తే రంగాచారి ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో తమ్ముడి తోటి ఉద్యోగులకు సమాచారం అందించింది. వారు వచ్చి చూడగా రంగాచారి మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు అనుమానాస్పదస్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.