హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల జడ్జీలను బదిలీ చేస్తూ సోమవారం వెలువడిన ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం నిలిపివేసింది.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బదిలీ ఉత్తర్వుల నిలిపివేత వర్తిస్తుందని ప్రకటించింది. బదిలీ అయిన వివిధ జిల్లాల న్యాయమూర్తులు ఈ నెల 26లోగా విధుల్లో చేరాలన్న హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది.