పెద్దపల్లి, ఏప్రిల్ 24: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటుపడ్డది. ఈ నెల 18న అల్పాహారం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ మేరకు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ ఎస్ సత్యప్రసాద్రాజ్ను బుధవారం పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కేర్‌టేకర్, అసిస్టెంట్ కేర్టేకర్లకు షోకాజ్ నోటీసులిచ్చి, సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. సస్పెన్షన్‌కు గురైన ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లవద్ద ని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ రామస్వామికి ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.