హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తమ డిమాండ్లను పరిష్కరించాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఇటీవల ఆందోళనలు చేసిన నేపథ్యంలో సస్పెండైన, తొలగించిన, ఆందోళనలో పాల్గొన్నవారికి వచ్చే నెల నుంచి వేతనాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 39 మందిని సస్పెండ్ చేసినా, 10 మందిని సర్వీసు నుంచి తొలగించినా, 21 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. వారిలో ఏమాత్రం భయం లేకపోవడంతో తమ దారికి తెచ్చుకునేందుకు ఇలా వేతనాలు ఇవ్వబోమని పోలీసు ఉన్నతాధికారులతో తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయా బెటాలియన్లలో ఆందోళనలు చేస్తున్న వారికి కమాండెంట్ల ద్వారా ఉ న్నతాధికారులు సమాచారం ఇచ్చారు.