హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవీకాలం పొడిగింపుపై గందరగోళం నెలకొన్నది. ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం.. వారి ద్వారా ఎన్నికైన మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవీకాలాన్ని మాత్రం పొడిగించలేదు. దీంతో మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారా, లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవి కోసం కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత చైర్మన్ గంగారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నట్టు సమాచారం.
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పని చేద్దాం ; ఎక్సైజ్ డైరెక్టర్ వీ బీ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లికర్, నాటుసారా నిర్మూలన కోసం నిరంతరం కృషి చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీ బీ కమలాసన్ రెడ్డి సిబ్బందికి సూచించారు. అబారీ భవన్లో మంగళవారం తెలంగాణ ఎక్సైజ్‌లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి క్యాష్ రివార్డులు అందించారు.