ఆత్మకూర్.ఎస్: అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంటి ఆడబిడ్డకు పెళ్లిచూపులు… ఇంతలోనే అశుభం.. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కైన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేని కొడుకు సైతం గుండెపోటుతో మృతి చెందిన హృదయ విదారక ఘటన ఆత్మకూర్.ఎస్ మండల కేంద్ర ఆవాసం నంద్యాలవారిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది.
బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల సత్తిరెడ్డి(82) లక్ష్మమ్మ దంపతులకు కుమార్తె రేణుక, కుమారుడు వెంకటరెడ్డి(47)ఉన్నారు. వెంక ట్రెడ్డి 20 సంవత్సరాలుగా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉం టుండగా ఆయనకు ఇద్దరు కుమార్తెలు శ్రావ్య, శ్రీజలు. కొంతకాలంగా వెంకటరెడ్డి పెద్ద కుమార్తె శ్రావ్యకు వివాహం చేసేందు కు సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం స్వగ్రామం నంద్యాలవారిగూడెంకు వచ్చి తండ్రి సత్తి రెడ్డి, తల్లి లక్ష్మమ్మలను హైదరాబాద్కు తీసుకెళ్లాడు.
బుధవారం మగ పెళ్లి వారు ఇంటికి రావాల్సి ఉండగా సోమవారం రాత్రి వెంకటరెడ్డి తండ్రి సత్తిరెడ్డి గుండె వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం సత్తిరెడ్డిని కుమారుడు నివాసానికి తీసుకురాగా మంగళవారం తెల్లవారుజామున మరోమారు గుండె నొప్పి రావడంతో మృతి చెం దాడు. కుమార్తె పెళ్లి చూపుల ఏర్పాట్ల నిమిత్తం బయటకు వెళ్లిన వెంకటరెడ్డి ఇంటికి వచ్చి తండ్రి హఠాన్మరణాన్ని తట్టు కొలేక తండ్రి మృతదేహం వద్ద రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.
కుటుంబ సభ్యులు, బంధువులు వెంకటరెడ్డిని దవాఖానకి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి చెందిన తండ్రి కొడుకుల మృతదేహాలను బుధవారం నంద్యాలవారిగూడెం గ్రామానికి తీసు కొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి గుండెపోటుతో మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ హృదయ విదారకమైన ఘటన నంద్యాలవారిగూడెం గ్రామంలో తీవ్ర విషాధఛాయలు అలుముకున్నాయి.
తండ్రులకు తలకొరివిలు పెట్టిన కుమార్తెలు
శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా పెద్ద దిక్కులను కోల్పోవడంతో అసలేం చేయాలో తెలియని స్థితిలో కుటుం బ సభ్యులు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మనుమరాలు పెళ్లి చేసి ఆశీర్వదించాలనుకున్న తాత సత్తిరెడ్డి, కుమార్తె పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకున్న తండ్రి వెంకటరెడ్డిలు ఒక్కసారిగా మృతి చెందడంతో గ్రామస్తు లు సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సత్తిరెడ్డికి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు తనతో పాటు తనువు చాలించ డంతో కుమార్తె రేణుక, వెంకటరెడ్డికి కుమారులు లేకపోవడం ఇద్దరు కుమార్తెలు కావడంతో చిన్నకుమార్తె శ్రీజ తల కొరివి పెట్టింది.