సూర్యాపేట టౌన్, జూలై 20 : సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత గోపగాని వేణుధర్గౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారానికి విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
గురువారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. త్వరలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు.