హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బిల్లులు ఇవ్వాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవటం విడ్డూరమని తెలిపారు. అసెంబ్లీలోనైనా స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించినా తమకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.