హిమాయత్‌నగర్, జూన్23: రాష్ట్రంలోని రెవెన్యూ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు రూ.30వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నారాయణగూడలోని సర్వేభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం తమను కమిషన్ ప్రాతిపదికన పనిచేయాలని సూచించడం అన్యాయమని, ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్రించారు. కార్యక్రమంలో నేతలు బాలకృష్ణ, రాకేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.