బచ్చన్నపేట, ఏప్రిల్ 6: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశ్వాపూర్‌కు చెందిన రైతు కొమ్మాటి రఘుపతి ఆత్మహత్యకు కారణమైన ఘటనలో సర్వేయర్ రవీందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై సతీశ్ శనివారం తెలిపారు.
రఘుపతికి చెందిన ఎకరా 20 గంటల భూమిని రికార్డులో నమోదు చేయించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రఘుపతి గత నెల 22న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సర్వేయర్ రవీందర్‌ను రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ సుమన్ కోసం గాలిస్తున్నామని చెప్పారు.