ఖమ్మం అర్బన్, మే 19 : సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రెమ్యునరేషన్, ఎస్ఎస్సీ స్పాట్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, నాగేశ్వరరావు మాట్లాడుతూ నవంబర్ 2024లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గ్గొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆరు నెలలు పూర్తయినప్పటికీ రెమ్యునరేషన్ మంజూరు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆంగ్లం, గణితం ఉపాధ్యాయులకు ఇప్పటివరకు స్పాట్ బకాయిలు విడుదల చేయలేదని వాపోయారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.