ములుగు, అక్టోబర్ 21(నమస్తేతెలంగాణ) : నలుగురు మావోయిస్టులు మంగళవారం ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో ఒకరు మిలీషియా కమాండర్‌గా పనిచేస్తున్న మడకం బందీతో పాటు పార్టీ సభ్యులుగా పనిచేస్తున్న మడవి కోసి, మడవి ఎడుము, ముచ్చిగ దేవా ఉన్నారు. పునరావాసం నిమిత్తం ఒక్కొరికి రూ.25 వేల చొప్పున తక్షణ సాయం అందించినట్టు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు డీవీసీఎంలు, 11మంది ఏసీఎంలు, 28మంది పార్టీ సభ్యులు, 32 మంది మిలీషియా సభ్యులు, ఒక ఆర్పీసీ సభ్యుడు, ఇద్దరు కేఏఎంఎస్ఎస్ సభ్యులు, ఏడుగురు సీఎన్ఎం సభ్యులు లొంగిపోగా వీరందరికీ ప్రభుత్వ పునరావాస పథకం కింద తగిన సదుపాయాలతోపాటు ఆర్థిక సాయం అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు.