కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 15 : మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయినట్టు తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. హేమచంద్రాపురంలోని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు ఆయన వివరాలు వెల్లడించారు. లొంగిపోయినవారంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన సభ్యులని తెలిపారు. ఏరియా కమిటీ సభ్యుడు మడకం జిమ్మెతోపాటు 10 మంది, 9 మంది రెవెల్యూషనరీ పీపుల్స్ కమిటీ, 19 మంది ఆర్పీసీ మిలీషియాలు, 11 మంది దండకారణ్యం ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ , కేఎంఎస్, ఆరుగురు చైతన్యనాట్య మండలి ఆర్పీసీ, 8 మంది ఆర్పీసీ జీఆర్డీసభ్యులు ఉన్నట్లు ఐజీ వెల్లడించారు. తెలంగాణకు చెందిన 97 మంది మావోయిస్టులు అజ్ఞాతంలోనే ఉన్నారని, వారిలో 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు.