హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): నిమ్స్‌లో నిర్వహిస్తున్న న్యూరో సర్జరీలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు టిమ్స్‌లో నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానలకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లతో కలిసి టిమ్స్‌ను ఆయన సందర్శించారు.
అనంతరం మాట్లాడుతూ.. అన్ని రకాల అవయవ మార్పిడీ శస్త్రచికిత్సలకు నిలయంగా సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.