Minister Konda Surekha | వేములవాడ, అక్టోబర్ 14: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కోసం స్వామివారికి అరగంట ఆలస్యంగా నైవేద్యం సమర్పించడంతో భక్తులు మండిపడ్డారు. స్వామివారి సన్నిధిలో మనువడి పుట్టువెంట్రుకల మొకులు చెల్లించుకునేందుకు మంత్రి కుటుంబ సమేతంగా సోమవారం రాజన్న ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ ఎన్టీఆర్ అతిథి గృహంలో పుట్టువెంట్రుకలు సమర్పించాక స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆదివారం ఏకాదశి కాగా.. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి మధ్యాహ్నం 3 గంటలకే నైవే ద్యం, అన్నపూజ నిర్వహించాలి. కానీ.. అధికారులు అత్యుత్సాహంతో నైవేద్యాన్ని ఆపి మరీ మంత్రి కొండా సురేఖ దంపతులతో స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించా రు. దీంతో స్వామివారికి అరగంట ఆలస్యంగా (3:30గంటలకు) అర్చకులు స్వామివారికి అన్నపూజ చేసి, నైవేద్యాన్ని సమర్పించారు.