ఆయన రాష్ట్రం గర్వించదగ్గ సామాజికవేత్త : మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు, సామాజిక వేత్త, దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి రావాలని సురవరం కుటుంబ సభ్యులు మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సామాజిక వేత్త సురవరం ప్రతాప్ రెడ్డి అని అభివర్ణించారు.
సాహితీ, సామజిక వేత్తగా, పత్రికా సంపాదకుడిగా విశేష సేవలను అందించారని కొనియాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ వద్ద సురవరం విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సురవరం ప్రతాప్‌రెడ్డి 125 వ జయంతి ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బుక్ ను సీఎం కేసీఆర్‌తో ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
వారిపై రూపొందించిన నాటకాన్ని ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రదర్శించేందుకు సాంస్కృతిక శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సురవరం ప్రతాప్ రెడ్డి కుమారుడు డా. కృష్ణ వర్ధన్, కుటుంబ సభ్యులు సురవరం కపిల్, నివేదిత, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

