హైదరాబాద్ : సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రక తీర్పునివ్వడం శుభపరిణామమని మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ (Former MP Vinod Kumar) అన్నారు. సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాంమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ (SC classification) సాధన కోసం డిల్లీలో అనేక సార్లు మంద కృష్ణ మాదిగతో కలిసి చర్చించానని వెల్లడించారు. సుప్రీం కోర్టులో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించానని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడిన మంద కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారానికి టీఆర్ఎస్(TRS) మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government ) వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.