హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): నూతన నేర న్యాయచట్టాలు బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎస్ఏ (భారతీయ సాక్ష్య అధినియమ్)ను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ ఇటీవల రిట్ పిటిషన్ వేశారు. కాగా శుక్రవారం సుప్రీంకోర్టు ఈ రిట్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌ను ఇతర పిటిషన్లతో కలిపి ఫిబ్రవరి 5న విచారణ జరుపనున్నట్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం ప్రకటించింది.