హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించడంపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయన నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదని పేర్కొంటూ టీ ధన్‌గోపాల్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారాల్లోగా డీజీపీ నియామక ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.