మళ్లీ కాంగ్రెసోళ్ల చేతిలో మోసపోం
‘కాంగ్రెసోళ్ల చేతిలో ఒకసారి మోసపోయాం.. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేం.. మిమ్మల్ని మోసం చేయం. ఈసారి కారు గుర్తుకే మా ఓటు’ అని నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంఆర్సీ తండా మహిళలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి హామీ ఇచ్చారు.
- ఈ సారి కారు గుర్తుకే మా ఓటు
- తేల్చి చెప్పిన ఆర్సీ తండా మహిళలు
- వారి మాటలకు కన్నీరు పెట్టిన మాజీ ఎమ్మెల్యే మర్రి
తిమ్మాజిపేట, ఏప్రిల్ 30: ‘కాంగ్రెసోళ్ల చేతిలో ఒకసారి మోసపోయాం.. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేం.. మిమ్మల్ని మోసం చేయం. ఈసారి కారు గుర్తుకే మా ఓటు’ అని నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంఆర్సీ తండా మహిళలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా మంగళవారం ఆర్సీ తండాలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా బస్టాండ్ వద్దకు చేరుకున్న మర్రి జనార్దన్‌రెడ్డిని చూసిన వాలి, సీత అనే మహిళలతోపాటు పలువురు ఆయన వద్దకు చేరుకున్నారు. ‘కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయాం.. కేసీఆర్, మీలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకున్నాం. ఈ సారి మాత్రం కారుకు తప్పా వేరే గుర్తుకు ఓటేయం’ అని మహిళలు చెప్పడంతో మర్రి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటోళ్లు.. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరో.. మంత్రులెవరో తెలియడం లేదు. వాళ్లు మా వద్దకు రావడం లేదు. ఫ్రీ బస్సు పేరిట మహిళల మధ్య కొట్లాటలు పె ట్టారు. గ్యారెంటీలు కూడా చేయడం లేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

