హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాజ్యాధికారం కోసమే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ సలహాదారు కే కేశవ్‌రావు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్, మంత్రులబృందానికి కృతజతలు తెలిపారు.
అన్నిపార్టీలు 42 శాతం రిజర్వేషన్లుకు మద్దతు తెలపాలని కోరారు.
హైదరాబాద్ జూలై 11 (నమస్తేతెలంగాణ): బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై బీసీ మేధావులు మౌనం వీడాలని కులనిర్మూలన సమితి అధ్యక్షుడు పాపని నాగరాజు కోరారు. 42 శాతం రిజర్వేషన్ కోటాకు తూట్లు పొడిచేందుకే జీవో పేరిట కాంగ్రెస్ సర్కారు దగా చేసేందుకు యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. సర్కార్ కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీలు ఉద్యమానికి సిద్ధంకావాలని కోరారు.