హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తన కెమెరాలో బంధించిన ‘సన్‌బర్డ్’ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సంతోష్‌కుమార్ అందమైన పక్షులను స్వయంగా ఫొటోతీసి ‘వీక్లీడోస్ ఫొటోగ్రఫీ’ పేరుతో ప్రతీ ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు. ఈ వారం ఆయన ‘సన్‌బర్డ్’ పక్షి ఫొటోలను షేర్ చేశారు. అత్యంత అందంగా, విభిన్న రంగులతో ఆకర్షణీయంగా ఉన్న సన్‌బర్డ్ పక్షి ఫొటోలు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చెట్టుపై తలకిందులుగా వేలాడుతూ పూల నుంచి మకరందాన్ని జుర్రుకుంటున్న పక్షి ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.