హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా అనుమతుల్లేని కోర్సులను నిర్వహిస్తున్న సన్ డిగ్రీ కాలేజీకి ఉస్మానియా యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. ఈ కాలేజీకి ఏకంగా రూ. 8లక్షల జరిమానా విధించింది.
ఈ కాలేజీ ఓయూ అనుమతి పొంది.. డిల్లీలోని ఓ విద్యాపీఠ్‌కు చెందిన డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నది. దీనిపై క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు మాసారం ప్రేమ్‌కుమార్ ఓయూ అధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన వర్సిటీ రూ. 8లక్షల జరిమానా విధించింది.