నర్సాపూర్(మెదక్) : తరుచూ ఫోన్లో గేమ్స్ ఆడుతుందని తండ్రి మందలించి సెల్‌ఫోన్ లాక్కోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య(Girl Suicide) చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా(Medak District)లో చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సునీతాలక్ష్మారెడ్డి కాలనీకి చెందిన జుబేరియా అంజుమ్(15) నర్సాపూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా ఎక్కువ సేపు సెల్ఫోన్లో గేమ్స్(Cell Phone Games) ఆడటం అలవాటు చేసుకుంది.
సోమవారం తెల్లవారుజామున జుబేరియా నిద్రలో నుంచి లేచి సెల్ఫోన్లో గేమ్ ఆడుతుండగా తండ్రి మహమ్మద్ షాబుద్దీన్ కూతురిని మందలించి సెల్‌ఫోన్ లాక్కున్నాడు. దీంతో జుబేరియా అంజుమ్ తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోని బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.