హైదరాబాద్, ఏప్రిల్ 1: నాణ్యమైన స్టీల్‌ను ఫ్యాక్టరీ ధరకే నేరుగా కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో సుగ్న మెటల్స్ సరికొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. రోహిత్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన తొలి అవుట్లెట్ ఇదే కావడం విశేషం. ప్రతి సామాన్యుడి ఇంటి నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల స్టీల్ ఈ అవుట్‌లెట్‌లో లభించనున్నాయని కంపెనీ చైర్మన్ భరత్ కుమార్ అగ్రవాల్ తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్లాంట్‌లో రోజుకు 1,300 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.