అంబర్‌పేట, జూలై 28 : హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనా థ్ స్పందించిన తీరును బీఆర్ఎస్ సీనియర్ నాయకు డు ఎడ్ల సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోర్టులు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే కంటెంప్ట్ పిటిషన్లను స్వీకరిస్తాయని, అలాంటి కేసులను ల్యాం డ్ మాఫియా వేసినవని అభివర్ణించ డం న్యాయవ్యవస్థను అవమానించేలా ఉన్నదని పేర్కొన్నారు. రంగనాథ్ ఓవైపు న్యాయవ్యవస్థను గౌరవిస్తానని చెప్తూ, మరోవైపు కోర్టును ఆశ్రయించిన వారిని ల్యాండ్ మాఫియాగా చి త్రీకరించడం విరుద్ధమైన వైఖరని దు య్యబట్టారు.
కోర్టును ఆశ్రయించిన ప్రతి వ్యక్తినీ ల్యాండ్ మాఫియాగా అభివర్ణించడం ద్వారా న్యాయవ్యవస్థ తీర్పు సామర్థ్యాన్నే ప్రశ్నించినట్టవుతుందని పేర్కొన్నారు. అధికార హో దాలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధ సంస్థలపై మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం సరికాదని, చట్టపరమైన వ్యవహారాల్లో న్యాయస్థానాల నిర్ణయాలను గౌరవించడం ప్రతి అధికారికి విధి అని స్పష్టంచేశారు.